IGNITE PHYSICS
ANDHRA
PRADESH – SCHOOL EDUCATION
SCERT
SYLLABUS
PHYSICAL SCIENCE
THE ULTIMATE
SUBJECT RESOURCE
BHANU’s
OCCASIONAL QUIZ SERIES
BHANU’s Occasional Quiz series By Pavani Bhanu
Chandra Murthy School Asst.
(P.S.) CHIRALA –
PRAKASAM Dist. |
ప్రపంచ క్యాన్సర్
దినోత్సవం - ఫిబ్రవరి 4 World Cancer
Day - 4th FEBRUARY |
కేన్సర్ గురించి అధ్యయనం చేసే
శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్
క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ
వైరస్. సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్
ద్వారా ముందుగా గుర్తించవచ్చు. 2006 నుండి ఫిబ్రవరి 4న
క్యాన్సర్ డే గా జరుపుతున్నారు. అప్పటి నుండి క్యాన్సర్
నివారణకు తగిన చర్యలు చేపట్టారు. మనదేశంలో నోటి క్యాన్సర్ కేసులు
అధికంగా నమోదవటానికి కారణం గుట్కా వాడకమే. కణాల పెరుగుదలలో నియంత్రణ
లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను
ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కణితి' (టూమర్, tumor) అంటారు. కణితి అన్నది రెండు స్వరూపాలలో
తారసపడవచ్చు: నిరపాయమైన కణుతులు (benign tumors), ప్రమాదకరమైన
కణుతులు (malignant tumors) కొన్ని రకాల కేన్సర్ల పేర్లు - ఓమా
శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, ... మొదలయినవి. మెలనోమా (melanoma) అంటే
మెలనోసైట్‌లు (అంటే మెలనిన్ కణాలు) విపరీతంగా పెరిగి కణితి లాగ ఏర్పడటం. మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors): ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని
కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన
ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ
ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. కేన్సరు సప్త సూచికలు : * మానని పుండు (Ulcer), * అసహజమైన రక్త స్రావం (Bleeding), * పెరుగుతున్న కణితి (Tumor), * తగ్గని దగ్గు (Cough), బొంగురు
గొంతు (Hoarseness of voice), * మలంలో రక్తం, మలవిసర్జనలో
మార్పు, * తగ్గని అజీర్తి, మింగుట
కష్టం, * పుట్టుమచ్చలలో మార్పు, లుకేమియా (Leukemia): గ్రీకు భాషలో 'లూకోస్' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి
సంబంధించిన'. కనుక
'లూకీమియా' అంటే 'తెల్ల
రక్తం' అని అర్ధం
వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని
పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం
చేస్తుంది. దీనిని 'ద్రవరూప కణితి' అని కూడా
అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే
రసాయనానికి 24గంటల లోపే
క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. |
CLICK HERE
TO PARTICIPATE in QUIZ ప్రపంచ
క్యాన్సర్ దినోత్సవం - ఫిబ్రవరి 4 |
BHANU’s
OCCASIONAL QUIZ SERIES
IGNITE PHYSICS
ANDHRA
PRADESH – SCHOOL EDUCATION
SCERT
SYLLABUS
PHYSICAL SCIENCE
THE ULTIMATE
SUBJECT RESOURCE
No comments:
Post a Comment